Asian Games 2023: షూటింగ్‌లో భారత్‌కి గోల్డ్ మెడల్.. చైనాను చిత్తు చేసి సంచలన విజయం       

Asian Games 2023: షూటింగ్‌లో భారత్‌కి గోల్డ్ మెడల్.. చైనాను చిత్తు చేసి సంచలన విజయం       

ఆసియా క్రీడల్లో భాగంగా భారత్ కి మరో గోల్డ్ మెడల్ దక్కింది. హాంగ్‌జౌలో నేడు జరిగిన పురుషుల ట్రాప్ టీమ్ ఈవెంట్‌లో భారత్‌కు చెందిన పృథ్వీరాజ్ తొండైమాన్, జోరావర్ సింగ్ సంధు, కినాన్ డారియస్ చెనాయ్ షూటింగ్ లో స్వర్ణం సాధించారు. లీడర్‌బోర్డ్‌లో 361 పాయింట్లతో భారత్ అగ్రస్థానాన్ని కైవసం చేసుకొని కువైట్ పై థ్రిల్లింగ్ విక్టరీ నమోదు చేసింది. 360 పాంట్లతో కువైట్ కు సిల్వర్ మెడల్, చైనాకి రజత పతకం దక్కింది.   
       
క్వాలిఫికేషన్‌లో కైనాన్ మొత్తం 122 పరుగులతో అగ్రస్థానంలో ఉండగా, జొరావర్ 120, పృథ్వీరాజ్ 119 స్కోరుతో ముగించాడు. మరోవైపు భారత మహిళల ట్రాప్ జట్టు రాజేశ్వరి కుమారి, మనీషా కీర్, ప్రీతి రజక్‌ 337 పాయింట్లతో రజతం సాధించింది.  దీంతో ప్రస్తుతం భారత   పతకాల సంఖ్య 41 కి చేరుకుంది. వీటిలో 10 గోల్డ్ మెడల్స్ ఉండడం విశేషం. ఓవరాల్ గా భారత్ ఆసియా క్రీడల్లో నాలుగవ స్థానంలో నిలవగా చైనా టాప్ లో కొనసాగుతుంది.